: కష్టాలు తీరేందుకు 5 నుంచి 10 ఏళ్లు పడుతుంది: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో కష్టాల్లో ఉన్నారని, ఇవన్నీ తీరేందుకు ఇంకా 5 నుంచి 10 సంవత్సరాల సమయం పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ పదేళ్లు తనతో పాటు ప్రతి ఒక్కరూ కష్టపడాలని కోరారు. నేడు గుంటూరులోని లాంఫాంలో జరిగిన వ్యవసాయ యూనివర్శిటీ శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. యూనివర్శిటీకి రూ. 1,500 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరితే, సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, వ్యవసాయ అవసరాల నిమిత్తం పగటి పూట కరెంటును ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News