: ఆలయం పైకెక్కి జారిపడిన శ్రీకాళహస్తి ఈఓ భ్రమరాంబ
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వందల సంవత్సరాల నాటి శ్రీకాళహస్తిలోని ఆలయంలోని విలువైన రాతి సంపద నాశనమవుతుండగా, వాటిని పరిశీలించేందుకు గుడి పైకి ఎక్కిన ఈఓ భ్రమరాంబ కాలు జారి పడిపోయారు. భారీ వర్షాలకు చోళుల కాలం నాటి ఈ ఆలయం యాగశాల, అమ్మవారి గర్భగుడిలోకి నీరు చేరుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రాతి శిల్పాలు, స్తంభాల మీదుగా ఆలయంలోకి నీరు వస్తోంది. సరస్వతీ తీర్థం, ధ్వజస్తంభం, నయనార్లు కొలువైన మండపాల్లోకి నీరు వస్తుండగా, ఈఓ భ్రమరాంబ లీకేజీలను పరిశీలించేందుకు గుడి పైకి వెళ్లారు. ఈ క్రమంలో ఆమె జారి పడటంతో స్వల్ప గాయాలు అయ్యాయి. వర్షాలు తగ్గగానే భవిష్యత్తులో లీకేజీలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.