: ఈ దఫా రావణుడిని వెనకేసుకొచ్చిన రాంగోపాల్ వర్మ!
తన వివాదాస్పద ట్వీట్లతో నిత్యమూ వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సారి రావణాసురుడిని వెనకేసుకొచ్చాడు. ఆయన సీతను ఎత్తుకెళ్లి తన అధీనంలో ఉంచుకున్నాడే తప్ప, ఏనాడైనా ఆమెపై అఘాయిత్యం చేయలేదని చెప్పుకొచ్చాడు. హిట్లర్, లాడెన్ లా భయంకర విలన్ గా ఎన్నడూ ప్రవర్తించినట్టు వినలేదని చెబుతూ, రావణుడు నిజంగా పెద్ద విలనా? అంటూ ప్రశ్నించి ఓ పోల్ క్వశ్చన్ తన ట్విట్టర్ ఖాతాలో ఉంచాడు. సీతను అపహరించడమే రావణుడి తప్పయితే, ఇండియాలో అతని కన్నా పెద్ద విలన్లను నెలకు 100 మందిని చూడొచ్చని అనుకుంటున్నట్టు తెలిపాడు. గత అర్ధరాత్రి నుంచి ఆయన ట్వీట్ల పరంపర కొనసాగింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించినది అమెరికా కాదా? అని కూడా రాంగోపాల్ వర్మ ప్రశ్నించాడు.