: అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇప్పించే బాధ్యత మాదే: హైకోర్టు
అగ్రిగోల్డ్ సంస్థ చేతిలో మోసపోయిన బాధితులకు ఉమ్మడి హైకోర్టు భరోసా ఇచ్చింది. బాధితులు ఆందోళన చెందవద్దని, డబ్బులు ఇప్పించే బాధ్యత తమదేనని తెలిపింది. కాగా వచ్చే వారంలోగా నివేదిక ఇవ్వాలని సీఐడీని ఇవాళ జరిగిన విచారణలో కోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్ కు చెందిన రూ.570 కోట్ల బ్యాంక్ డిపాజిట్లను కోర్టు అకౌంట్ కు మళ్లించాలని తెలిపింది. సీఐడీ సీజ్ చేసిన రెండున్నర కిలోల బంగారం, రూ.7.40 లక్షలను కూడా తమ అకౌంట్ కు జమ చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.