: ఓయూలో 'అజారుద్దీన్' సినిమా షూటింగ్ ను అడ్డుకున్న విద్యార్థులు


హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో బాలీవుడ్ సినిమా 'అజారుద్దీన్' షూటింగ్ కు ఆటంకం కలిగింది. ప్రముఖ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దీన్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కోసం ఈ నెల 13న ఓయూ రిజిస్ట్రార్ అనుమతి తీసుకున్న సినిమా నిర్మాతలు అందుకు నగదు కూడా చెల్లించారు. వర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో హైకోర్టుకు సంబంధించిన దృశ్యాలు చిత్రీకరించేందుకు సెట్లు కూడా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ కోసం సినిమా హీరో ఇమ్రాన్ హష్మీ, హీరోయిన్ లారాదత్తా, వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలకు వచ్చారు. షూటింగ్ విషయం తెలుసుకున్న విద్యార్థులు అక్కడికి వచ్చి ఆందోళన చేశారు. తక్షణమే షూటింగ్ నిలిపివేయాలన్నారు. అయితే ఈ సమయంలో నిర్వాహకులు విద్యార్థులకు ఎంత నచ్చజెప్పినా వినలేదు. దాంతో తమకు రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు నష్టం వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. తాము అడిగినంత డబ్బు ఇస్తేనే షూటింగ్ జరుపుకోనిస్తామని, లేదంటే అడ్డుకుంటామని కొంతమంది విద్యార్థి నాయకులు బెదిరించారని చెప్పారు. ఈ ఘటన నిన్న(ఆదివారం) చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News