: ఫ్రాన్స్ ప్రతీకార దాడులు... 10 విమానాలతో సిరియాపై బాంబుల వర్షం


తమ దేశంపై జరిగిన ఉగ్రదాడికి ఫ్రాన్స్ సమాధానం చెప్పడం ప్రారంభించింది. ఆదివారం పొద్దుపోయిన తరువాత (భారత కాలమానం ప్రకారం నేటి తెల్లవారుఝామున) 10 యుద్ధవిమానాలు యూఏఈ, జోర్డాన్ దేశాల్లోని బేస్ ల నుంచి సిరియావైపు దూసుకెళ్లి, ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయని భావించిన చోటల్లా బాంబుల వర్షం కురిపించాయి. మొత్తం 20 శక్తిమంతమైన బాంబులను జార విడిచినట్టు ఫ్రెంచ్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఫ్రాన్స్ తాజా దాడులతో అమాయకులే అత్యధికంగా మరణించారని తెలుస్తోంది. ఓ ఫుట్ బాల్ స్టేడియం, ఓ మ్యూజియం, ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో 30కి పైగా బాంబులు పడ్డాయని, 2 లక్షల మందికి విద్యుత్ సరఫరా అందించే కేంద్రం పేలిపోయిందని మానవ హక్కుల కార్యకర్తలు వెల్లడించారు. ఎంతమంది మరణించారన్న విషయం తెల్లారితేగాని చెప్పలేమని తెలిపారు.

  • Loading...

More Telugu News