: ‘అయాం శ్రీమంతుడు’ లక్కీ డ్రా విజేత నాగేందర్ రెడ్డి!
ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన 'శ్రీమంతుడు' చిత్రం శనివారంతో వందరోజులు పూర్తి చేసుకుంది. రికార్డు కలెక్షన్లు సాధించిన ఈ చిత్రంలో మహేశ్ బాబు Cannondale Scalpel Carbon 3 cycle ఉపయోగించారు. దీని విలువ రూ.3,50,000. ఆ సైకిల్ ను లక్కీ అభిమానికి అందజేసే ఉద్దేశ్యంతో నిర్వహకులు ఒక డ్రాను నిర్వహించారు.‘అయాం శ్రీమంతుడు’ పేరిట నిర్వహించిన ఈ లక్కీ డ్రా విజేతగా నాగేందర్ రెడ్డి అనే వ్యక్తి నిలిచాడు. ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ఈ సైకిల్ ని లక్కీ విన్నర్ కు త్వరలో అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, మహేశ్ బాబు ఉపయోగించిన ఈ సైకిల్ కావాలనుకునే అభిమానులు రూ.999 డొనేట్ చేసి బిడ్ లో పాల్గొనాలని, చిత్రం వందరోజులు పూర్తి చేసుకున్న రోజున ఈ డ్రా నిర్వహిస్తామని నిర్వాహకులు నాడు ప్రకటించడం తెలిసిన విషయం తెలిసిందే.