: పారిస్ దాడిలో ఉపయోగించిన ఉగ్రవాదుల కారు స్వాధీనం


పారిస్ దాడిలో ఉగ్రవాదులు ఉపయోగించినట్లుగా అనుమానిస్తున్న బ్లాక్ సీట్ కారును మాంట్రెయల్ కి సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెల్జియంలో అద్దెకు తీసుకున్న గ్రే పోలో కారును బటాక్లాన్ కన్సర్ట్ హాల్ దగ్గర స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, బటా క్లాన్ ఏరియాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తిని పారిస్ లో నివసించే ఒమర్ ఇస్మాయిల్ ముస్తఫా(29)గా పోలీసులు గుర్తించారు. ముస్తఫా తండ్రి, అన్న, వదిన సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రీస్, బెల్జియం, జర్మనీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. పారిస్ దాడికి సంబంధించి అనుమానితులుగా భావిస్తున్న పలువురిని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News