: ప్రొద్దుటూరు కోర్టుకు గంగిరెడ్డిని తరలిస్తాం: డీజీపీ రాముడు


ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డిని తొలుత ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపరుస్తామని ఏపీ డీజీపీ రాముడు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు కోర్టులో ఆయనపై కేసు పెండింగ్ లో ఉందని, అందుకే మొదట అక్కడి కోర్టులో హాజరు పరుస్తామని ఆయన చెప్పారు. అనంతరం మిగిలిన కేసుల విచారణ నిర్వహిస్తామన్నారు. మిగిలిన స్మగ్లర్లను కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. గంగిరెడ్డి మారిషన్ లో పెద్ద లాయర్లను నియమించుకోవడంతో ఇక్కడికి రప్పించే విషయంలో న్యాయపరంగా కొంత జాప్యం జరిగిందన్నారు. గంగిరెడ్డి అక్రమంగా సంపాదించిన సొమ్ముతో వారికి చెల్లింపులు చేశారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News