: జీసస్ ఓల్డేజ్ హోంకు 'బాహుబలి' ప్రభాస్ విరాళం
బాహుబలి విజయంతో హుషారుగా ఉన్న నటుడు ప్రభాస్ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని జీసస్ ఓల్డేజ్ హోంకు ప్రభాస్ రూ.5 లక్షల విరాళం అందజేశాడు. కమర్షియల్ బ్రాండింగ్ లలో కూడా నటించడం ప్రారంభించిన ప్రభాస్ సేవా కార్యక్రమాలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు. బాహుబలి విజయంతో తమ ఫ్యాన్స్ తో వరుస సమావేశాలు జరిపిన ‘డార్లింగ్’ ప్రభాస్ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. కాగా, బాహుబలి-2 చిత్రం షూటింగ్ డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కానుంది. దీంతో తన కండలను మరింత పెంచే పనిలో ప్రభాస్ మునిగిపోయాడు. వచ్చే ఏడాది చివరి నాటికి బాహుబలి-2 చిత్రం విడుదలవుతుందని సినీ వర్గాల సమాచారం.