: ప్రెస్ క్లబ్ లో హైదరాబాద్ జర్నలిస్టుల మధ్య రభస!


హైదరాబాద్ జర్నలిస్టుల మధ్య ఈ మధ్యాహ్నం తీవ్ర వాగ్వాదం, రభస జరిగాయి. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ కార్యవర్గం, రాజ్యాంగ సవరణ అజెండాగా, ఈ ఉదయం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా, ఓ వర్గం జర్నలిస్టులు తీవ్ర ఆందోళన చేపట్టారు. తమకు నచ్చని వారిని తొలగించేలా నిబంధనలు మార్చుతున్నారని, మరో రెండు వారాల్లో కాలపరిమితి పూర్తయ్యే కార్యవర్గం, ఇప్పుడు ఇంత అర్జంటుగా నిబంధనలను ఎందుకు మార్చాలని కోరుకుంటున్నారని ప్రశ్నించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో హైదరాబాద్ జర్నలిస్టులు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. కాగా, ఇంతవరకూ ఏపీయూడబ్ల్యూజే అనుబంధ సంస్థగా కొనసాగుతున్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ను, ఇకపై స్వతంత్ర కమిటీగా కొనసాగించాలని కూడా క్లబ్ రాజ్యాంగ నిబంధనలను మార్చాలని ఈ సమావేశంలో ప్రతిపాదించారు.

  • Loading...

More Telugu News