: సత్తా తగ్గలేదని నిరూపిస్తున్న సచిన్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపిస్తున్నాడు. ఆల్ స్టార్స్ టీ-20 క్రికెట్ పోటీల్లో భాగంగా లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సచిన్ సేన ఐదు ఓవర్లలోనే స్కోరును 70 పరుగులు దాటించింది. ఓపెనర్ సెహ్వాగ్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 27 పరుగులు చేసి అవుట్ కాగా, సచిన్ విజృంభించాడు. కేవలం 13 బంతుల్లో ఒక ఫోరు, నాలుగు సిక్సుల సాయంతో 34 పరుగులు చేసి అభిమానులను అలరిస్తున్నాడు. మరోవైపు వన్ డౌన్ గా బ్యాటింగ్ కు వచ్చిన మహేల 3 బంతుల్లో 10 పరుగులు సాధించాడు. పస్తుతం సచిన్ బ్లాస్టర్స్ స్కోరు 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 77 పరుగులు.