: ఇక యుద్ధమే... దయ చూపే సమస్యే లేదన్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్


తమ ఉగ్రవాదంతో ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న ఐఎస్ఐఎస్ పై ఇక ఏ మాత్రమూ ఉపేక్షించేది లేదని, వారి చర్యలను ప్రపంచంపై యుద్ధంగానే పరిగణిస్తున్నామని అమెరికా, రష్యా, ఫ్రాన్స్ లతో పాటు పలు యూరప్ దేశాలు స్పష్టం చేశాయి. సిరియాలో నెలకొన్న సంక్షోభంపై వియన్నాలో సమావేశమైన పలు దేశాల ప్రతినిధులు ఈ మేరకు తీర్మానం చేశారు. ఉగ్రవాదుల దాడుల శక్తి పెరిగిందని అభిప్రాయపడ్డ వీరు, ఇక ఐఎస్ఐఎస్ ను పూర్తిగా తుదముట్టించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్రూరులపై దయాదాక్షిణ్యాలు చూపేది లేదని వ్యాఖ్యానించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండె, టర్కీలో జరుగుతున్న జీ-20 సదస్సుకు హాజరు కాబోవడం లేదని తెలిపారు. ఫ్రాన్స్ సరిహద్దులను మూసి వేయాలని ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు, తాత్కాలికంగా సరిహద్దులను మూసి వేస్తున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News