: తలుపు తెరవండి ప్లీజ్...పారిస్ ఘటనలో ఓ బాలిక ఆర్తనాదం


ఐసిస్ కాల్పులు పారిస్ వాసులకు భయంకరమైన అనుభవాల్ని మిగిల్చాయి. పారిస్ లో ఏ వ్యక్తిని కదిలించినా నిన్నటి ఘటన గురించే మాట్లాడుతున్నాడు. ఓ 30 ఏళ్ల యువకుడు ఆంటోనీ పోర్చీ కూడా అలాగే తను చూసిన సంఘటనను పంచుకున్నాడు. తుపాకీ పేలుళ్లు ప్రారంభం కాగానే, ఇంట్లో ఉన్న తాను కిటికీ తలుపులు తెరచి చూశానని, రోడ్లమీద ప్రజలు హాహాకారాలు చేసుకుంటూ పరుగెత్తడం కనిపించిందని అన్నాడు. క్షణాల్లో కాల్పులు విస్తరించాయని, తలో దిక్కుగా ఉగ్రవాదులు చెదిరిపోయారని అర్థం చేసుకున్నానని ఆయన చెప్పాడు. అయితే, రోడ్డు మీద నిస్సహాయంగా ఉన్న ఓ బాలిక ఏడుస్తూ పరుగెడుతూ, ప్రతి ఇంటి తలుపునూ తడుతూ, 'తలుపు తెరవండి ప్లీజ్' అని అడుగుతూ వెళ్లిందని, క్షణాల్లో తన కంటి చూపు నుంచి ఆమె దూరమైందని ఆయన పేర్కొన్నాడు. ఇంతలోనే భద్రతా దళాలు రంగంలోకి దిగాయని, క్షణాల్లో ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయని, ఆ క్షణంలో ఏమీ చేయలేని తన అసహాయతను చూసి బాధపడ్డానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News