: భారత్ ఒప్పుకుందోచ్...!: పీసీబీ చీఫ్


పాకిస్థాన్ తో టీమిండియా ఆడేందుకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ తెలిపారు. పాకిస్థాన్ లో ఆయన మాట్లాడుతూ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిందని అన్నారు. గత సాయంత్రం బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్ తనకు ఫోన్ చేశారని, భారత్ లో సిరీస్ నిర్వహించేందుకు ఎలాంటి అభ్యతంరం లేదని చెప్పారని ఆయన తెలిపారు. భారత్ లో నిర్వహించే సిరీస్ లో పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపడతామని ఆయన చెప్పారని షహర్యార్ ఖాన్ పేర్కొన్నారు. ఈ సిరీస్ నిర్వహించేదుకు అనువైన వేదికలుగా మోహాలీ, కోల్ కతా లను చూపించారని ఆయన చెప్పారు. అయితే ఈ సిరీస్ ను యూఏఈలోనే నిర్వహించాలని కోరుతున్నామని, అలా అయితే పీసీబీకి 300 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని శశాంక్ మనోహర్ కు తెలిపినట్టు షహర్యార్ వెల్లడించారు. అలాగే భారత్ లో ఈ సిరీస్ నిర్వహించాల్సి వస్తే తాము తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన చెప్పినట్టు తెలిపారు. దీనిపై పీసీబీ సభ్యులతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News