: జేమ్స్ బాండ్, బ్రూక్ బాండ్ దాటి... రూపీ బాండ్ కు వెళదాం: మోదీ
లండన్ లోని వెంబ్లీ స్టేడియంలో భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ... సరికొత్త విషయాన్ని తెలిపారు. కొత్తగా తీసుకువచ్చిన రూపీ బాండ్ గురించి మాట్లాడుతూ... "బాండ్ అంటే నాకు జేమ్స్ బాండ్ గుర్తుకు వస్తాడు. అదే విధంగా బ్రూక్ బాండ్ టీ గుర్తుకు వస్తుంది. జేమ్స్ బాండ్ వినోదాన్ని అందిస్తే, బ్రూక్ బాండ్ శక్తిని ఇస్తుంది. కానీ ఇప్పుడు మనం వినోదాన్ని, రిఫ్రెష్ మెంట్ ను దాటి అభివృద్ధి దిశగా వెళ్లాల్సి ఉంది. అందువల్ల జేమ్స్ బాండ్, బ్రూక్ బాండ్ ల తర్వాత రూపీ బాండ్ కు వెళదాం" అని చెప్పారు. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజిలో మన రైల్వే శాఖ రూపీ బాండ్ ను లిస్టింగ్ చేసిన తర్వాత ఆ విషయంపై మోదీ మాట్లాడటం ఇదే తొలిసారి.