: మోదీ ప్రశంసలందుకున్న ఇమ్రాన్ ఖాన్ ఎవరంటే...!


బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నిన్న లండన్ లోని వెంబ్లీ స్టేడియంలో ప్రవాస భారత జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మన దేశానికి చెందిన ఇమ్రాన్ ఖాన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. విద్యకు సంబంధించిన 52 యాప్ లను అభివృద్ధి చేసి, అందరికీ ఉచితంగా అందిస్తున్నారని ఇమ్రాన్ ను ఆయన కొనియాడారు. దీనిపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్ తాను చేసింది తక్కువేనని... కానీ, ప్రధాని నుంచి అభినందనలు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. రాజస్థాన్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా ఇమ్రాన్ ఖాన్ పనిచేస్తున్నారు. 2012లో తొమ్మిదవ తరగతి విద్యార్థుల కోసం ఆయన తొలి యాప్ ను తయారుచేశారు. ఇప్పటిదాకా ఆయన అభివృద్ధి చేసిన యాప్ లలో హిందీ భాషలో జనరల్ సైన్స్ యాప్ బాగా ఆదరణ పొందింది. దాదాపు 5 లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. మూడేళ్లలో 42 ఆండ్రాయిడ్ యాప్ లను ఖాన్ డెవలప్ చేశారు. 25 లక్షల మంది ఈ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోగా... 1.80 కోట్ల స్క్రీన్ వ్యూస్ వచ్చాయి.

  • Loading...

More Telugu News