: ఒంగోలు జాతి పశు సంపదను కాపాడాలని కేంద్ర మంత్రిని కోరా: వైవీ సుబ్బారెడ్డి


వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ను కలిశారు. ఒంగోలు జాతిపశు సంపద రక్షణపై ప్రధానంగా ఆయన చర్చించారు. దేశానికే గర్వకారణమైన ఈ పశువులను వృద్ధి చేసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్టు మీడియాతో వైవీ చెప్పారు. ఒంగోలు జాతి గిత్తల కృత్రిమ పిండాలు బ్రెజిల్ కు ఇవ్వొద్దని రాధామోహన్ సింగ్ ను కోరినట్టు తెలిపారు. దొడ్డిదారిలో ఒంగోలు గిత్తల కృత్రిమ పిండాలను బ్రెజిల్ తీసుకుంటోందని, అలా ఇస్తే భారత్ తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రెజిల్ లో పశు సంపద వృద్ధికి అనుసరిస్తున్న సాంకేతిక విజ్ఞానాన్ని మన దేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుబ్బారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News