: ఏబీ ఔట్... ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా


బెంగళూరులో సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. తొలి టెస్టులో ఇండియాకు ఘన విజయాన్ని అందించిన అశ్విన్, జడేజాలు... ఈ టెస్టులో కూడా సఫారీలకు చుక్కలు చూపిస్తున్నారు. వీరిద్దరి స్పిన్ మాయాజాలానికి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమవుతోంది. టీ విరామానికి మరో నాలుగు బంతులు మిగిలి ఉన్న సమయంలో సౌతాఫ్రికా 177 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 100వ టెస్ట్ ఆడుతున్న డివిలియర్స్ 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు 15 పరుగులు చేసిన విలాస్... జడేజాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మన బౌలర్లలో అశ్విన్, జడేజాలు చెరి మూడు వికెట్లు పడగొట్టగా, ఆరోన్ ఒక వికెట్ తీశాడు. ఈ రోజు ఆటలో మరో 38 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

  • Loading...

More Telugu News