: ఫ్రాన్స్ పై ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా అప్రమత్తం
ప్యారిస్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 150 మందికి పైగా మరణించారు. ఈ ఘటనతో ఫ్రాన్స్ మొత్తం వణుకుతుండగా, ప్రపంచ దేశాలన్నీ షాక్ కు గురయ్యాయి. ఈ నేపథ్యంలో, అగ్రరాజ్యం అమెరికా అలర్ట్ అయింది. దేశంలోని నగరాలు, ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. జనాలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల వద్ద నిఘా పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ముందస్తు చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు.