: ధనిక రాష్ట్రం తెలంగాణ ఆర్బీఐ ర్యాంకింగ్స్ లో ఏపీ వెనుక నిలిచిన కారణమేంటంటే...!


ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంతో దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఆర్థికంగా చూస్తే ధనిక రాష్ట్రమే. గుజరాత్ తర్వాత సిరిసంపదలతో తులతూగుతున్న రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ సర్కారు ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో అనుమానించాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే, భాగ్యనగరి హైదరాబాదులో వస్తున్న పన్ను రాబడి తెలంగాణను ఆర్థికంగా పటిష్టమైన రాష్ట్రంగా తీర్చిదిద్దింది. అంతేకాక పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించిన తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అగ్రగామి పారిశ్రామిక సంస్థలు క్యూ కడుతున్నాయి. అయితే పెట్టుబడుల ఆకర్షణీయ రాష్ట్రాల జాబితాలో మాత్రం తెలంగాణ వెనుకబడిపోయింది. ఎంతగానంటే, కనీసం రాజధాని కూడా లేకుండా లోటు బడ్జెట్ తో సతమతమవుతున్న అవశేష ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్రప్రదేశ్) కంటే ఆమడ దూరంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన పెట్టుబడుల ఆకర్షణీయ రాష్ట్రాల జాబితాలో ఏపీ 2వ స్థానంలో నిలిస్తే, తెలంగాణ 13వ స్థానంతో సరిపెట్టుకుంది. దీనికి గల కారణాలను వెలికితీసేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ రంగంలోకి దిగారు. నిన్న ఆయన ఆర్థిక, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్తగా జరుగుతున్న ఏర్పాట్లకు సంబందించిన వివరాలను అధికార యంత్రాంగం సకాలంలో ఆర్బీఐకి అందించలేదట. ఈ కారణంగానే ధనిక రాష్ట్రమైన తెలంగాణ పెట్టుబడుల ఆకర్షణలో మాత్రం పేద రాష్ట్రమైన ఏపీ కంటే వెనుకబడిపోయింది.

  • Loading...

More Telugu News