: న్యూజిలాండ్ పై వార్నర్ దండయాత్ర


ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ దండయాత్ర చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలతో విరుచుకుపడ్డ డేవిడ్ వార్నర్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు వార్నర్ (244), బర్న్ స్ (40) శుభారంభం ఇచ్చారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖాజా (121) కివీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. వార్నర్, ఖాజా వీర విహారం చేయడంతో రెండో వికెట్ కు వీరిద్దరూ 302 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి డబుల్ సెంచరీ చేసిన వార్నర్ కు జతగా స్టీవ్ స్మిత్ (5) క్రీజులో ఉన్నాడు.

  • Loading...

More Telugu News