: వర్ధమాన సినీ నటుడు బాల ప్రశాంత్ మృతి
'ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబూ' సినిమాలో నటిస్తున్న వర్ధమాన సినీ నటుడు బాల ప్రశాంత్ మృతి చెందాడు. అనంతపురం జిల్లా గుంతకల్ కు చెందిన ప్రశాంత్ హైదరాబాదులోని మూసాపేటలో ఓ భవనంపై నుంచి కిందపడి మృతి చెందాడు. మూసాపేటలో ఓ వివాహితతో ప్రశాంత్ కు అక్రమ సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఇతను ఆమెతో కలసి వుండగా ఆమె బంధువులు రావడంతో, వారి నుంచి తప్పించుకునే క్రమంలోనే ఆయన భవనంపై నుంచి కిందపడి మృతి చెందినట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.