: పంచారామాలకు తెలంగాణ ప్రత్యేక బస్సు సర్వీసులు


కార్తీక మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని పంచారామ క్షేత్రాలకు తెలంగాణ ఆర్టీసీ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడవనున్నాయి. ఈ విషయాన్ని టీఆర్టీసీ అధికారులు తెలిపారు. పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు ప్రతి ఆదివారం ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు ఉంటాయన్నారు. ఈ బస్సు సర్వీసులు ఆదివారం రాత్రి 7 గంటలకు బయల్దేరతాయని చెప్పారు. టికెట్ ధర విషయానికొస్తే... ఒక్కొక్కరికి రూ.1800గా నిర్ణయించినట్లు అధికారులు వివరించారు. కాగా, కార్తీకమాసంలో శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పంచారామ క్షేత్రాలకు వెళ్లే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుంది. పంచారామ క్షేత్రాలతో పాటు శివయ్య కొలువుదీరిన ప్రతి క్షేత్రంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు మొదలైన పూజలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.

  • Loading...

More Telugu News