: సరైన నాయకత్వం ఇవ్వగలిగితేనే అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది: చంద్రబాబు


అన్ని స్థాయులలోనూ తెలుగుదేశం పార్టీ సరైన నాయకత్వం ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అలా ఇవ్వగలిగినప్పుడే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పార్టీ గెలుస్తుందని చెప్పారు. అలా అన్ని స్థాయులలోనూ నాయకత్వం లేకపోతేనే ఇబ్బందులు పడతామని అన్నారు. తిరుపతిలో ఇవాళ ప్రారంభమైన పార్టీ దిశా-నిర్దేశం కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ప్రసంగించారు. ఏపీ ప్రజలు ఓ నమ్మకంతో పార్టీని గెలిపించారని, మనం అయితేనే న్యాయం జరుగుతుందని విశ్వాసం ఉంచారని పేర్కొన్నారు. కాబట్టి పార్టీలో అంతర్గత విభేదాలు లేకుండా నాయకత్వం ముందుకు వెళితే అన్ని నియోజకవర్గాల్లో మనమే గెలుస్తామని బాబు నిర్దేశించారు. పార్టీ నేతలు తప్పు చేసినా, నేను తప్పు చేసినా పార్టీపై ప్రభావం పడుతుందన్నారు. కావాలని మనపై దష్ప్రచారం చేసే వారి మాటలను ఎప్పటికప్పుడు ఖండించే విధంగా ఉండాలని ఉద్బోధించారు.

  • Loading...

More Telugu News