: చంద్రబాబు, పవన్ లు ప్రజలను మోసం చేస్తున్నారు: సీపీఐ రామకృష్ణ


ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల తాజా భేటీపై విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి. వారిద్దరూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. పవన్ కళ్లకు చంద్రబాబు గంతలు కట్టారని, అందుకే రాజధాని కోసం లక్షల ఎకరాలు భూమి సేకరించినా, బాక్సైట్ తవ్వకాలు చేస్తున్నా పవన్ ప్రశ్నించలేదని విమర్శించారు. అసలు ఏ ఆంతర్యంతో వారిద్దరు భేటీ అయ్యారోనని అన్నారు. డిసెంబర్ 7న ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట ప్రత్యేక హోదా కోసం సీపీఐ ధర్నా నిర్వహించబోతుందని, ఈ ధర్నాకు చంద్రబాబు, పవన్ లు హాజరుకావాలని రామకృష్ణ అన్నారు. ఇప్పటికైనా పిరికితనాన్ని వదిలి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు.

  • Loading...

More Telugu News