: మోదీ మార్గాన్ని అడ్డుకోవద్దు: ఐఎంఎఫ్


మోదీ వెడుతున్న సంస్కరణల మార్గాన్ని ఎవరూ అడ్డుకోవద్దని అంతర్జాతీయ ద్రవ్యనిధి సూచించింది. తాము మనస్ఫూర్తిగా ఆయన విధానానికి మద్దతు పలుకుతున్నామని, ఇండియాను సరైన దిశగా నడిపించేలా ఆయన నిర్ణయాలు ఉన్నాయని ఐఎంఎఫ్ ప్రతినిధి గ్యారీ రైస్ వ్యాఖ్యానించారు. ఇండియాలో మోదీ సర్కారు తీసుకున్న ఆర్థిక సంస్కరణల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. ఇటీవలి ఎఫ్డీఐ పరిమితుల సడలింపులపై ఆయన స్పందించారు. ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టిన్ లగార్డే, భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితర ప్రపంచ నేతలు టర్కీలో జరిగే జీ-20 (అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల సమాఖ్య) సమావేశాల్లో కలుసుకోనున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News