: తిరుపతిలో ప్రత్యేక ప్రవేశ దర్శనం బుకింగ్ కౌంటర్ ప్రారంభం
చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయంలో ఏర్పాటు చేసిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్ల విక్రయ కేంద్రం ప్రారంభమైంది. టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆ కేంద్రాన్ని ప్రారంభించారు. రోజుకు 5వేల టికెట్లు విక్రయిస్తామని ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ తెలిపారు. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో 5వేల టికెట్లను విక్రయించగా, శుక్ర, శనివారాల్లో మరో 2,500 టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్టు వెల్లడించారు. ఆన్ లైన్ లో టికెట్లు లభించని వారు తిరుపతి చేరుకున్న తరువాత కూడా ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం బుకింగ్ కౌంటర్ లో కొనుగోలుచేసి స్వామిని దర్శించుకోవచ్చు.