: వ్యూహం మార్చిన అమిత్ షా
బీహార్ ఎన్నికల ఫలితాలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పీడకలను మిగిల్చాయి. తానే నిర్ణయం తీసుకున్నా నిన్న మొన్నటి వరకు సరే అని తల ఊపినవారంతా బీహార్ ఎన్నికల ఫలితాలతో విమర్శలు ఎక్కుపెడుతుండడంతో అమిత్ షా వెనక్కి తగ్గారు. ఇందులో భాగంగా ఈ నెలాఖరు నుంచే పశ్చిమ బెంగాల్ లో పార్టీ ప్రచారం ప్రారంభించాలని భావించిన అమిత్ షా వెనక్కి తగ్గారు. ఇప్పుడే ప్రచారం ప్రారంభిస్తే బీహార్ ఎన్నికల ఫలితాలే పునరావృతమయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో వచ్చే ఏడు జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం డిసెంబర్ చివరి వారంలో మొదలు పెట్టాలని భావిస్తున్నారు. దీంతో ఈ నెల 30న నిర్వహించాల్సిన బహిరంగ సభను కూడా రద్దు చేసుకున్నారు. జనవరి నుంచి బెంగాల్ లో ప్రధాని ప్రచారం ప్రారంభించనున్నారు. మమతా బెనర్జీని ఎదుర్కోవాలంటే బీజేపీ పూర్తి స్థాయి బలం పుంజుకోవాలని, వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఆయన భావిస్తున్నారు.