: తలసానికి హైకోర్టు నోటీసులు... అనర్హతపై నాలుగు వారాల్లో జవాబివ్వాలని ఆదేశం
టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కేబినెట్ లో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న తలసాని శ్రీనివాసయాదవ్ కు కొద్దిసేపటి క్రితం హైకోర్టు షాకిచ్చింది. మంత్రి పదవికి తలసాని అనర్హుడని ఆరోపిస్తూ తంగెళ్ల శివప్రసాదరెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు, దీనిపై స్పందించాలని ఆదేశాలు జారీ చేస్తూ మంత్రికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు సదరు నోటీసుల్లో తలసానికి సూచించింది. ఇప్పటికే ఇదే విషయంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఘాటుగా బదులిస్తున్న మంత్రి తలసాని హైకోర్టు నోటీసులకు ఏ విధంగా స్పందిస్తారన్న అంశంపై ఆసక్తికర చర్చకు తెర లేచింది.