: బాక్సైట్ తవ్వకాలపై జీవో మాత్రమే విడుదల చేశాం...ఇంకా ముందడుగు వేయలేదు: మంత్రి గంటా


విశాఖ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వ అనుమతిపై ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి నిషేధాన్ని ఎత్తివేస్తూ కేవలం జీవో మాత్రమే విడుదల చేశామని, అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని కొద్దిసేపటి క్రితం విశాఖలో ఆయన వ్యాఖ్యానించారు. తవ్వకాలు అసలు మొదలే కాలేదని కూడా గంటా వ్యాఖ్యానించారు. బాక్సైట్ జీవోపై గిరిజనుల ఆందోళనలను తాము గుర్తించామని, త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో దీనిపై మరోమారు సమగ్రంగా చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గంటా చెప్పారు.

  • Loading...

More Telugu News