: ఇండియాలో బద్దలవడానికి సిద్ధంగా ఉన్న 'ఓఆర్ఓపీ' అగ్నిపర్వతం!
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ)ను డిమాండ్ చేస్తూ, మాజీ సైనికులు తలపెట్టిన నిరసనలు మరింతగా పెరుగుతుండగా, వీరిని సముదాయించేందుకు ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్ తరువాత "ఓ అగ్నిపర్వతం బద్దలయ్యేందుకు సిద్ధంగా ఉంది" అని గ్రూప్ కెప్టెన్ వీకే గాంధీ వ్యాఖ్యానించారు. ఈ స్కీమును అంగీకరించేందుకు మాజీ సైనికులెవరూ సిద్ధంగాలేరని ఆయన అన్నారు. సైనికులంతా తమకు గతంలో వచ్చిన పురస్కార పతకాలను వెనక్కిచ్చేందుకే నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. కొత్తగా కేంద్రం ప్రకటించిన స్కీము తమకు ఏ మాత్రమూ సమ్మతం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ప్రతి వ్యక్తికీ డిమాండ్ చేసే హక్కుంటుందని, అయితే, అందరి డిమాండ్లనూ నెరవేర్చడం ఎవరికీ సాధ్యం కాదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.