: ఒక్కరోజు రూ.91 వేల కోట్ల అమ్మకాలు... ‘అలీబాబా’ రికార్డు


ఆన్ లైన్ విక్రయాల్లో చైనా ఈ-కామర్స్ దిగ్గజం ‘అలీబాబా’ దూసుకెళుతోంది. ఏటా నవంబరు 11న ‘సింగిల్స్ డే’ పేరిట ప్రత్యేక ఆపర్లతో ‘అలీబాబా’ వినియోగదారుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సింగిల్స్ డే సందర్భంగా నిరుడు రికార్డు విక్రయాలు సాధించిన ఈ సంస్థ సింగిల్ డేలో అత్యధిక విక్రయాల రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా నిన్నటి ‘సింగిల్స్ డే’ విక్రయాలతో గతేడాది తాను నెలకొల్పిన రికార్డులను అలీబాబా తానే బద్దలు కొట్టేసింది. నిన్నటి ‘సింగిల్స్ డే’ విక్రయాల్లో భాగంగా రూ.91 వేల కోట్ల విలువ చేసే వస్తువులను విక్రయించింది. గతేడాది ‘సింగిల్స్ డే’ విక్రయాలతో పోలిస్తే ఈ ఏడాది రికార్డు విక్రయాలు 60 శాతం పెరిగాయట.

  • Loading...

More Telugu News