: షారూఖ్ ను ఈడీ విచారించడానికి కారణాలు ఇవే!
ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్) నిబంధనలను ఉల్లంఘించాడన్న ఆరోపణలపై బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిన్న మూడు గంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే. జూహీచావ్లా, ఆమె భర్త జై మెహతా నిర్వహిస్తున్న రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ అధీనంలోని నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వాటాలను విక్రయించిన విషయంలో నిబంధనలను పాటించలేదన్నది షారూఖ్ పై ఉన్న ప్రధాన అభియోగం. ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్ కతా నైట్ రైడర్స్ లో షారూఖ్ కు సైతం వాటాలున్నాయి. ఆయన తన వాటాలో కొంత భాగాన్ని వేరే సంస్థకు విక్రయించాడు. ఈ లావాదేవీలో ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు అందలేదని అధికారులు గతంలోనే తేల్చారు. కాగా, షారూఖ్ ను ఈడీ విచారించడం ఇదే తొలిసారి కాదు. 2008-09లో వాటాల విక్రయం జరుగగా, 2010లో కేసు నమోదైంది. తనవైపు నుంచి ఏ విధమైన చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని షారూఖ్ అంటున్నాడు.