: స్టాక్ మార్కెట్లలో దీపావళి జిలుగులు... గంటలో 123 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్


దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న జిగేల్ మన్నాయి. కేవలం గంట వ్యవధిలోనే భారీగా లాభపడ్డాయి. దీపావళిని పురస్కరించుకుని నిన్న బాంబే స్టాక్ ఎక్సేంజీ, నేషనల్ స్టాక్ ఎక్సేంజీల్లో గంట పాటు మూరత్ (ముహూరత్) ట్రేడింగ్ జరిగింది. నిన్న సాయంత్రం 5.45 గంటలకు మొదలైన ట్రేడింగ్ 6.45 గంటలకు ముగిసింది. ఈ స్వల్ప కాల వ్యవధిలో సెన్సెక్స్ 123 పాయింట్లు లాభపడి 25,866 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 41 పాయింట్లు లాభపడి 7,825 పాయింట్ల వద్ద క్లోజైంది. ఓపక్క మూరత్ ట్రేడింగ్ సెంటిమెంట్, మరోపక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల సడలింపు నేపథ్యంలో భారీ ట్రేడింగ్ జరిగింది. సంప్రదాయ గుజరాతీ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున స్టాక్స్ కొనుగోలు చేశారు.

  • Loading...

More Telugu News