: ఆకాశం నుంచి కిందపడుతున్న వస్తువులు...ఆందోళనలో స్పెయిన్ వాసులు


ఆకాశం నుంచి అకస్మాత్తుగా వింత వస్తువులు కింద పడుతున్నాయని స్పెయిన్ వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీన కలస్పార్రా ప్రాంతంలో గోళాకారంలోని వస్తువు ఒకటి పంటపొలాల్లో పడింది. అది పడిన చోట పెద్ద గొయ్యి కూడా ఏర్పడింది. దీంతో ఆ పొలం యజమాని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పరిశోధకులు, అధికారులు వచ్చి ఆ వస్తువును స్వాధీనం చేసుకుని పరిశోధనల నిమిత్తం తీసుకెళ్లిపోయారు. తాజాగా మర్సియా ప్రాంతంలోని నివాస స్థలంలో మరొకటి పడింది. దీంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది. గ్రహాంతర వాసులు విసురుతున్న వస్తువులుగా వీటిని కొంత మంది భావిస్తుండగా, మరి కొందరు స్వర్గం నుంచి కిందపడిన వస్తువులుగా పేర్కొంటున్నారు. ఇంకొందరు గతంలో శాత్రవేత్తలు అంతరిక్షంలోకి పంపిన వస్తువులే ఇలా కిందపడుతున్నాయని పేర్కొంటుండగా, అలా అంతరిక్షంలోకి పంపిన వస్తువులైతే భూమిమీద పడేటప్పుడు మంటలు చెలరేగి మసైపోవాలని లాజిక్ తీస్తున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం వాటి నిగ్గుతేల్చడంలో మునిగిపోయారు. ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ ఆ మిస్టరీ ఎప్పుడు వీడుతుందా అని ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News