: ఒక్క గెలుపుతో గర్వం నెత్తికెక్కకూడదు!...మిత్రులకు నితీశ్ హితవు


ఒక్క గెలుపుతో గర్వం నెత్తికెక్కించుకోకూడదని నితీశ్ కుమార్ మిత్ర పక్షాలకు హితబోధ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ రామనాథ్ కోవిద్ ను కలిసిన సందర్భంగా పాట్నాలో ఆయన మాట్లాడుతూ, పరిపాలనలో ప్రతిపక్షాలు కూడా బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలను ఎట్టి పరిస్థితుల్లోను విస్మరించమని ఆయన స్పష్టం చేశారు. ఒక్క విజయంతో గర్వం నెత్తికెక్కితే అది మంచి వ్యక్తిత్వం అనిపించుకోదని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఈ నెల 14 నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ఆయన, శనివారం మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని అన్నారు. మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్షం కూడా తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News