: ఈడీ ఆఫీస్ లో షారూక్ ఖాన్!...3 గంటల పాటు ప్రశ్నల వర్షం
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కు చిక్కులు తప్పేలా లేవు. విదేశీ మారక నిధులపై ఆరోపణలు ఎదుర్కొంటున్న షారూక్ పై ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రెండుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే తాను అందుబాటులో లేనని ఈడీ నోటీసులకు సమాధానమిచ్చిన షారూక్ నేటి ఉదయం నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్లక తప్పలేదు. నేటి ఉదయం తమ కార్యాలయానికి వచ్చిన షారూక్ ను ఈడీ అధికారులు దాదాపు 3 గంటలకు పైగా విచారించారు. విదేశీ మారక నిధుల ప్రవాహంపై పలు కోణాల్లో ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఆ ప్రశ్నలకు షారూక్ కూడా ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారట.