: బాబు గారూ! అపాయింట్ మెంట్ ఇవ్వండి... జనసేన అధినేత పవన్ కల్యాణ్ రిక్వెస్ట్


జనసేన అధినేత, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ మరోమారు రంగంలోకి దిగారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, రైతుల సమస్యలపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయన నేరుగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ కావాలని భావిస్తున్నారు. ఈ మేరకు తనకు చంద్రబాబుతో భేటీకి అపాయింట్ మెంట్ ఇవ్వాలని పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం సీఎంఓ కార్యాలయానికి వర్తమానం పంపారు. రేపు తాను చంద్రబాబుతో భేటీ కావాలనుకుంటున్నానని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను కోరారు. పవన్ కల్యాణ్ అభ్యర్థనకు ఏపీ సీఎంఓ కూడా సానుకూలంగానే స్పందించే అవకాశాలున్నాయి. దీంతో రేపు మధ్యాహ్నం విజయవాడకు వెళ్లనున్న పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ఖాయమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News