: ఎల్లప్పుడూ మోసం చేయడం రాజకీయాల్లో కుదరదు!... బీజేపీకి శివసేన చురకలు


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీకి విపక్షాల నుంచే కాక మిత్రపక్షాలు, స్వపక్షం నుంచి కూడా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఫలితాల సరళిని చూసి బీజేపీకి దాని మిత్రపక్షం శివసేన చురకలంటించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధిస్తున్న నితీశ్ కుమార్ ను ఆ పార్టీ అధికార ప్రతినిధి ‘పొలిటికల్ హీరో’గా అభివర్ణించారు. తాజాగా శివసేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో రాసిన వ్యాసంలో మరోమారు బీజేపీపై విరుచుకుపడింది. ఎల్లప్పుడూ మోసం చేయడం రాజకీయాల్లో పనిచేయదని అందులో ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించింది. ‘‘అలలు వస్తుంటాయి... పోతుంటాయి. అవి పోయాక, వాటి ఆనవాళ్లు కూడా కనిపించవు. సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కూడా అలాంటిదే’’ అని ఆ కథనంలో తన మిత్రపక్షానికి శివసేన హితబోధ చేసింది.

  • Loading...

More Telugu News