: ఆల్ ది బెస్ట్ అఖిల్: సినీ నటుడు రానా
'అఖిల్' చిత్రం దీపావళికి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘వన్ డే టు గో’ అనే పోస్టర్ ను యువ హీరో అఖిల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్ ను చూసిన రానా ‘ఆల్ ది బెస్ట్ ... అఖిల్. స్టే స్ట్రాంగ్, లవ్ ఆల్ వేస్’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా, అఖిల్ చిత్రం విడుదల సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు వివి వినాయక్, యువహీరో అఖిల్ తిరుమలకు వెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖిల్ ను చూసేందుకు అభిమానులు తరలివచ్చిన విషయం తెలిసిందే.