: చైనాలో సీక్రెట్ గా సాగుతున్న క్రూరమైన వైద్యం!
చైనాలో 'గే'లను పురుషుల్ని చేస్తామంటూ పలువురు వైద్యులు సీక్రెట్ గా అత్యంత ప్రమాదకరమైన వైద్యాన్ని అమలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. మానసిక లోపాల కారణంగా పురుషులు గేలుగా మారుతారని భావించే చైనాలో స్వలింగ సంపర్కాన్ని నిషేధించారు. ఇక్కడే వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా తమ పని ప్రారంభించారు. 'గే' ఆలోచనలు అరికడతామని చెబుతూ షాక్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఈ ట్రీట్ మెంట్ కూడా పురుషుని జననాంగానికి, తలకు విద్యుత్ తీగలు అమర్చి షాక్ ట్రీట్ మెంట్ ఇస్తారు. దీని ద్వారా కోరికలు నియంత్రించవచ్చని చెబుతున్నారు. ఈ వైద్యం అత్యంత ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ క్రూరమైన వైద్యం గురించిన విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు గేలుగా నటించి వెలుగులోకి తీసుకురాగా, పోలీసులు తిరిగి వీరిపైనే కేసులు నమోదు చేయడం విశేషం. ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులపై శిక్ష పడేలా ప్రయత్నించడంపై సర్వత్రా విమర్శలు కురుస్తున్నాయి.