: అభివృద్ధిని వదిలి మతాన్ని పట్టుకున్నారు... అందుకే ఓడిపోయారు: బీజేపీపై కవిత సెటైర్లు
తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినా మోదీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని టీఆర్ఎస్ ఎంపీ కవిత మండిపడ్డారు. ఎన్నికలప్పుడు వాగ్దానాలను గుప్పించి, ఆ తర్వాత తప్పించుకుంటున్నారని విమర్శించారు. కేవలం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే ప్రధాని మోదీ వరాలు కురిపిస్తున్నారని అన్నారు. అభివృద్ధిని వదిలి బీజేపీ నేతలు మతాన్ని పట్టుకున్నారని... అందుకే బీహార్ లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికలో ప్రచారం చేసేందుకు బీజేపీ, టీడీపీలకు పెద్ద దిక్కే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. వరంగల్ లో వార్ వన్ సైడే అని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని... జాతీయ పార్టీలు బలహీనపడతాయని అన్నారు. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని... ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు.