: హైదరాబాద్ లో సీపీఐ నారాయణ దంపతుల ఓట్లు తొలగింపు


జీహెచ్ఎంసీలో పరిధిలో ఓట్ల తొలగింపు మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే పలువురు తమ ఓట్లు తొలగించారంటూ ఫిర్యాదు చేస్తుండగా, ఇప్పుడు సీపీఐ సీనియర్ నేత నారాయణ, ఆయన సతీమణి ఓట్లను సర్వే అధికారులు తొలగించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని బీఎన్ రెడ్డి టవర్స్ ప్లాట్ నెం.104లో నారాయణ నివాసముంటున్నారు. అయితే ఓటరు జాబితాలో తమ పేర్లు లేకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దానిపై ఆయన మాట్లాడుతూ, ఓట్ల తొలగింపులో అక్రమాలు జరుగుతున్నాయనడానికి తమ ఓట్ల తొలగింపే నిదర్శనమని అన్నారు. దానిపై జీహెచ్ఎంసీ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News