: ఈ దీపావళి తరువాత ఇల్లు కదలొద్దు... కారణం నవంబర్ కావడమేనట!
సాధారణంగా దీపావళి పండగ అక్టోబర్ నెలలో వస్తుంటుంది. కానీ ఈ సంవత్సరం అధికమాసం రావడంతో నవంబర్ నెలకు మారింది. ఇది శ్వాస సంబంధ వ్యాధులున్నవారితో పాటు గుండె జబ్బుల వారికి మరింత ప్రమాదాన్ని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శీతల పవనాలు పెరగడం కారణంగా గాలిలో దుమ్ము, ధూళి అధికంగా ఉంటుందని, దీని కారణంగా టపాకాయల పొగ ఆకాశంలో మరింత ఎత్తునకు వెళ్లబోదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక నవంబర్ 12న దేశంలోని చాలా ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా ఉంటుందని, టపాకాయల ద్వారా వెలువడే కాలుష్య కణాలు, చలి వాతావరణంలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీ వంటి నగరాల్లోని ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే రుగ్మతలతో బాధపడుతున్నవారు కనీసం రెండు రోజులు బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు సలహా ఇచ్చారు.