: అందరూ టకటకా సమాధానాలిస్తుంటే... ఆ అధికారి మాత్రం సెల్ఫీలు తీసుకుంటూ దొరికిపోయాడు!


ఓ ప్రభుత్వాధికారి సెల్ఫీ పిచ్చి ఆయన ఉద్యోగానికే ఎసరు పెట్టింది. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో జిల్లా అధికారులందరితో కలెక్టర్ యోగేశ్వర్ రామ్ మిశ్రా ఓ సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ శాఖల అధికారులతో పాటు మంగళ్ పాండే అనే బ్లాక్ డెవలప్ మెంట్ అధికారి (బీడీఓ) కూడా పాల్గొన్నారు. సమావేశం సీరియస్ గా సాగుతోంది. పలు అంశాలపై కలెక్టర్ అందరినీ ప్రశ్నించగా టకటకా సమాధానాలు ఇస్తున్నారు. కానీ, మంగళ్ పాండే వద్దకు వచ్చేసరికి ఏ సమాధానం రాలేదు. ఎందుకా అని కలెక్టర్ పరిశీలించగా అధికారి మొబైల్ ఫోన్లో సెల్పీలు తీసుకుంటున్నాడని తెలిసింది. దాంతో కోపోద్రిక్తుడైన కలెక్టర్ వెంటనే ఆయన్ను బీడీఓ పదవి నుంచి తప్పించి, వేరే జిల్లాకి బదిలీ చేయాలని ఆదేశాలిచ్చారు. ఆ స్థానంలో కొత్త బీడీఓగా సుశాంత్ సింగ్ అనే అధికారిని నియమించారు. ఈ చర్యతో ఒక్కసారిగా మిగతా అధికారులంతా ఆశ్చర్యపోయారు. ఇకపై సమావేశాల్లో సెల్ ఫోన్లు వాడటానికి వీల్లేదంటూ కలెక్టర్ వారిని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News