: హరీష్ రావుకు చేదు అనుభవం... మంత్రిని అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు


టీఎస్ మంత్రి హరీష్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్న ఆయనను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎస్సీల వర్గీకరణపై టీఆర్ఎస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు, ప్రచార కార్యక్రమంలో భాగంగా హరీష్ రావు మాట్లాడుతూ, టీడీపీ, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ఓటర్లను డబ్బిచ్చి కొనాలని ఈ రెండు పార్టీలు చూస్తున్నాయని మండిపడ్డారు. ఈ పార్టీల పాచిక పారదని... టీఆర్ఎస్ అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు.

  • Loading...

More Telugu News