: బీహార్ ఫలితాలతో మాయావతి ఖుషీ
బీహార్ ఎన్నికల్లో మహాకూటమికి ఏకపక్షంగా ఓట్లు వేసిన అక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉందని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. బీజేపీ, మహాకూటమి మధ్య ప్రత్యక్ష పోరు జరిగినందువల్లే తమ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని ఆమె చెప్పారు. ఇప్పటి బీహార్ ఫలితాలు... 2017లో జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. బీహార్ ఎన్నికల ప్రభావం బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలపై పడుతుందని... తమ పార్టీకి అనుకూలంగా ఉంటుందని మాయ తెలిపారు. 2017లో యూపీలో అధికార పీఠం తమదేనని... ఏ శక్తీ తమను అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తప్పుడు విధానాలు, మత ధోరణి ప్రజలకు అర్థమయ్యాయని చెప్పారు.