: కేసీఆర్ ను ‘చిన్న మోదీ’గా అభివర్ణించిన కాంగ్రెస్... ఓరుగల్లులో పరాజయం తప్పదని కామెంట్


వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో నిన్న గాంధీ భవన్ వేదికగా బీహార్ ఎన్నికల్లో మహా కూటమి విజయాన్ని పురస్కరించుకుని సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మధు యాష్కీ గౌడ్, మర్రి శశిధర్ రెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్, మల్లు రవి తదితరులు అధికార పార్టీ టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై ఆసక్తికర కామెంట్లు విసిరారు. కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ నేతలు ‘చిన్న మోదీ’గా అభివర్ణించారు. బీహార్ లో పెద్ద మోదీకి ఎదురుదెబ్బ తగిలినట్లే, వరంగల్ ఉప ఎన్నికల్లో ‘చిన్న మోదీ’కి ఓటమి తప్పదని వారు తేల్చిచెప్పారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయని ఆరోపించారు. అదే సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. బీహార్ ఎన్నికల్లో మోదీకి బుద్ధి చెప్పినట్లే, వరంగల్ ఉప ఎన్నికలో కేసీఆర్ కు కూడా గుణపాఠం తప్పదని వారు జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News