: కడలూరు దగ్గర తీరం దాటిన వాయుగుండం
తమిళనాడులోని కడలూరు దగ్గర వాయుగుండం తీరం దాటింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో బీభత్సం సృష్టించింది. దీంతో తక్షిణ కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరిల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను క్రమేపీ బలహీనపడతుందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు నుంచి నెల్లూరు జిల్లా వరకు సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 48 గంటలపాటు సముద్రంలో చేపలవేట నిషేధించారు. తమిళనాడులోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. నేటి అర్ధరాత్రి తరువాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించనున్నారు. దీని ప్రభావం రెండు రోజులు ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనిఅధికారులు చెప్పారు. రెండు రోజులపాటు తీర ప్రాంత వాసులకు తమిళనాడు ప్రభుత్వం ఆహారం సమకూర్చనుంది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అధికారులు పునరావాస చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.